Latest News

హరీష్ రావును గుంట నక్కతో పోల్చిన కవిత

posted on: Jan 25, 2026 4:22PM

 

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఐఏఎస్ మీద ఇష్టానుసరంగా  రాసిన జర్నలిస్టులకు ఆయన ఎలా సహకరిస్తున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ మీద ఓ ఛానల్ వార్త రాస్తే బీఆర్‌ఎస్ కార్యకర్తలు వెళ్లి దాడి చేశారు. ఇప్పుడు ఓ శాటిలైట్ ఛానల్ ప్రతినిధులకు ఎందుకు సహకరిస్తున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్ అని కవిత నిలదీశారు. మేఘా అనే తిమింగలాన్ని రక్షించేందుకు బీఆర్ఎస్ చిన్న చేప చుట్టూ టెండర్ల వ్యవహారాన్ని తిప్పుతోందని ఆమె ఆరోపించారు. సింగరేణి కాంట్రాక్ట్ ల విషయంలో సృజన్ రెడ్డి చిన్న చేప..మేఘా కృష్ణారెడ్డికి రూ. 25 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని దాని మీద బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడటం లేదని కవిత నిలదీశారు. 

కార్మికులకు కష్టం వస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు పట్టించుకోవటం లేదని..పెద్ద కాంట్రాక్టర్‌ను  కాపాడేందుకు గుంటనక్క ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి హారీశ్‌రావు ఉద్దేశించి విమర్శించారు. గతంలో సృజన్ రెడ్డికి బీఆర్ఎస్ హయాంలోనే కాంట్రాక్ట్ లు ఇచ్చారు. అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బావమరది అని గుర్తుకు రాలేదా? సింగరేణి విషయంలో బీఆర్ఎస్ డొల్లతనాన్ని మేము గమనిస్తున్నామని తెలిపారు. గుంటనక్క ప్రెస్ మీట్‌ను  గుడ్డిగా ఫాలో అయి కేటీఆర్  ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మొత్తానికి నైనీ కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇక్కడ విచిత్రాలు జరగుతున్నాయని కవిత తెలిపారు. హరీష్ రావు మొత్తం దళిత కమ్యూనిటీనే అవమానపరిచే విధంగా భట్టి విక్రమార్కకి లేఖ రాయను అంటున్నారు.  

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మాత్రమే ఆయన లెటర్ రాస్తారంటా? అసలు సింగరేణిలో ఎండీవో అనే సిస్టమ్ పెట్టారు. అది ఉండకూడదని ఆమె అన్నారు. కిషన్ రెడ్డి  ఈ బ్లాక్ కు సింగరేణికి వచ్చేలా కృషి చేయాలి..రూల్స్ అనకుండా మనకు వచ్చేందుకు ఆయన తరఫున ప్రయత్నం చేయాలని కవిత డిమాండ్ చేశారు.గతంలో గుజరాత్ కు బొగ్గు బ్లాక్ లను తీసుకొని పోయిన ఘటనలు లేవా? కిషన్ రెడ్డి  తెలంగాణ కోసం చేయకపోతే బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చి ఏం లాభమని ఆమె తెలిపారు. తర్వలోనే సింగరేణిలో ఎన్నికలు రాబోతున్నాయి. 

ఇప్పటికైనా కార్మికుల డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేయాలని కవిత కోరారు.  నేను కాంగ్రెస్‌కు వస్తానంటే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్  వద్దన్నానంటూ చెబుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లూజింగ్ పార్టీ అని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచే పార్టీయే జాగృతి పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. మహేష్ గౌడ్ అనుభవం ప్రకారం ఆయనకే మేము నేషనల్ కన్వీనర్ పదవి ఇస్తామని కవిత తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ జోక్ అయిపోయింది. రెండేళ్లుగా సీరియల్ గా సాగదీస్తున్నారు. నా లాంటి బాధితులకు మేలు చేయటం లేదని కవిత అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...