Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు
posted on: Jun 26, 2026 3:54PM
.webp)
తెలంగాణ ప్రభుత్వం కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ శాఖల్లో పరిపాలనా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు సీనియర్ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించడంతో పాటు, కొందరికి పూర్తి అదనపు బాధ్యతలు (FAC) కూడా కేటాయించింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎండోమెంట్స్, విపత్తుల నిర్వహణ, హ్యాండ్లూమ్స్, మైనారిటీల సంక్షేమం, గనులు, రోడ్లు-భవనాల శాఖల వరకు ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.
ప్రధాన బదిలీలు, నియామకాలు ఇలా ఉన్నాయి..
సబ్యసాచి ఘోష్‌కు హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్స్ & హ్యాండీక్రాఫ్ట్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు (FAC) అప్పగించారు. అలాగే టీజీ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ (VC & MD), టీజీసీవో ఎండీగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.
శైలజా రామయ్యర్‌ను ఎండోమెంట్స్ శాఖ ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. అదనంగా ఈపీటీఆర్‌ఐ (EPTRI) డైరెక్టర్ జనరల్ బాధ్యతలు కూడా అప్పగించారు. అహ్మద్ నదీమ్‌ను రాజకీయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయనకు మైనారిటీల సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి అదనపు బాధ్యతలు కూడా కేటాయించారు.
ఎన్. శ్రీధర్‌ను ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం సీఎం కార్యాలయ పరిపాలనలో కీలకంగా మారనుంది. సెలవుల అనంతరం విధుల్లో చేరిన రాహుల్ బొజ్జాను విపత్తుల నిర్వహణ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి అదనపు బాధ్యతలు కొనసాగనున్నాయి.
ఎం. రఘునందన్ రావుకు గనులు & భూగర్భ శాఖ కార్యదర్శి అదనపు బాధ్యతలు అప్పగించారు. బి. అజిత్ రెడ్డిని ఇన్వెస్ట్ తెలంగాణ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా బదిలీ చేశారు. ముషర్రఫ్ అలీ ఫారూకీకి టీజీఆర్ఈడీసీవో (TGREDCO) వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. పి. కాత్యాయనీ దేవిని హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్స్ & హ్యాండీక్రాఫ్ట్స్ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. అదనంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ ఎండీ బాధ్యతలు కూడా నిర్వహించనున్నారు.
కె. గంగాధర్‌ను రోడ్లు & భవనాల (R&B) శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు. హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ టి. వెంకన్నను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలతో రాష్ట్రంలోని కీలక శాఖల్లో పరిపాలనా పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు స్పష్టమవుతోంది. కొత్త బాధ్యతలు చేపట్టనున్న అధికారులు త్వరలోనే తమ తమ శాఖల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.






