తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా
posted on: Jun 29, 2020 11:13AM
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడురోజుల క్రితమే మహమూద్ అలీ కరోనా టెస్టులు చేయించుకున్నారు. అస్తమా ఉండటంతో ముందుగానే కుటుంసభ్యులు ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచే ఆయనను అపోలోకు తరలించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలువురు మంత్రులు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు.
మరోవైపు అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇటీవల హోంమంత్రిని కలిసిన వారిని క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. అలాగే హోంమంత్రి నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది శానిటైజర్ చేస్తున్నారు.





.webp)




