గీతం యూనివర్సిటీకి హైకోర్టు షాక్

posted on: Jan 23, 2026 9:45AM

మూడు వారాల్లో రూ.54 కోట్లు డిపాజిట్ కు ఆదేశాలు

విద్యుత్ బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం వహించిన గీతం యూనివర్శిటీకి తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది.  మొత్తం విద్యుత్ బకాయిలలో 50శాతం అంటే రూ.54 కోట్లు మూడు వారాలలోగా డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.  

సంగారెడ్డి సర్కిల్ పరిధిలోని రుద్రారం సెక్షన్ పరిధిలో ఉన్న గీతం యూనివర్సిటీకి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కు రూ.118 కోట్ల మేర విద్యుత్ బకాయిలు ఉన్న విషయం తెలిసిందే. ఈ బకాయిల వసూళ్ల కోసం డిస్కం అధికా రులు పలుమార్లు నోటీ సులు జారీ చేసినా కూడా గీతం యూనివర్సిటీ యాజ మాన్యం స్పందించకపోవడం తో  అధికారులు కోర్టుకు వెళ్లారు.డిస్కం పరిధిలో వివిధ సర్కిళ్ల నుంచి మొత్తం రూ.2400 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు కోర్టు కేసులతో లింక్ అయి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మొండి బకాయిలను వసూలు చేయడంలో భాగంగా గత ఏడాది జూలైలో సీఎండీ ముషారఫ్ ఫారూఖీ   ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగానే బకాయిదారులందరికీ డిస్కనెక్షన్ నోటీసులు జారీ చేశారు.

సరే ఆ స్పెషల్ డ్రైవ్ కారణంగా ఇప్పటి వరకూ   రూ.500 కోట్ల మేరకు బకాయిలు వసూలయ్యాయి.  అయితే గీతం యూనివర్సిటీ మాత్రం బకాయిలు చెల్లించకుండా  హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన  హైకోర్టు  ద్విసభ్య ధర్మాసనం, యూనివర్సిటీ యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ సంస్థలకు చెల్లిం చాల్సిన బకాయిలను తప్పించుకునే ప్రయత్నాలు సహించబోమని స్పష్టం చేసిన ధర్మాసనం, మూడు వారాల్లోగా రూ.54 కోట్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...