గ్రామ పంచాయతీలకు శుభవార్త

posted on: Feb 20, 2026 3:07PM

 

తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం కింద మూడవ విడతలో భాగంగా 387.53 కోట్లు విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే రూ. 259.36 కోట్లు విడుదల కాగా రెండో విడత కింద రూ. 387 కోట్లు రిలీజ్ చేసింది. తాజాగా మూడో విడత నిధులు రిలీజ్ చేయడంతో దీంతో ఇప్పటివరకు 1034.42 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులను గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు వినియోగించాలని కేంద్రం ఆదేశించింది. 

దాదాపు 2 ఏళ్ల పాటు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఆలస్యం కావడంతో 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. ఎన్నికలు పూర్తి కావడంతో కేంద్రం విడతల వారీగా ఈ నిధులను కేంద్రం రాష్ట్రానికి అందిస్తోంది. కాగా తెలంగాణకు కేంద్రం ఇంక రూ.2000 కోట్లు బాకీ ఉందని.. గ్రామాల అభివృద్ధి కోసం పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...