కేసీఆర్ మొక్కను మార్చారు

posted on: Sep 17, 2017 5:12PM

మూడో విడత హారితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా మానేరు కట్ట దిగువన నాటిన మొక్క వాడిపోవడం విమర్శలకు దారితీసింది. ఏకంగా ముఖ్యమంత్రి నాటిన మొక్కనే అధికారులు పట్టించుకోకపోతే రాష్ట్రంలోని మిగిలిన వాటి పరిస్థితి ఏంటని ప్రతిపక్షాలు ఆరోపించడంతో పాటు మీడియాలో కథనాలు రావడంతో కరీంనగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో నిన్న అర్థరాత్రి తర్వాత ఎండిపోయిన మొక్క స్థానంలో మరో మొక్కను నాటారు.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...