హోలీ సెలవుపై తెలంగాణ సర్కార్ క్లారిటీ

posted on: Mar 3, 2026 8:47AM

హోలీ పండుగను బుధవారం (మార్చి 4) జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. సర్కార్ విడుదల చ ేసిన వాల్ అకడామిక్ క్యాలెండర్ 2026-26లో హోలీ పండుగ సెలవును మార్చి 4గా పేర్కొంది.  కాగా  2026 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన సాధారణ సెలవుల జాబితాలో హోలీపండుగ  మార్చి 3వ తేదీన నిర్వహించనున్నట్లు  ప్రకటించింది. ఈ రెండు ప్రకటనల మధ్య తేదీలలో తేడా ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యాసంస్థలు మరియు ఇతర విభాగాల్లో ఒకింత  గందరగోళం నెలకొంది.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యా లయం అధికారిక గెజిట్‌లో ప్రకటించిన సెలవుల జాబితానే తుది నిర్ణయంగా పరిగణించాలనీ, అందువల్ల మార్చి 3వ తేదీన హోలీ పండుగ సెలవును పాటించాలని అన్ని శాఖలకు అంతర్గత ఉత్తర్వులు పంపించారు. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యా సంస్థలు, ఇతర అనుబంధ సంస్థలు మార్చి 3  సెలవు పాటించను న్నాయి. అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్న తేదీకి బదులుగా అధికారిక సెలవుల జాబితాలో ఉన్న తేదీనే అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

హోళీ పండుగను దృష్టిలో ఉంచుకుని అవసరమైన పరిపాలనా ఏర్పాట్లు చేసుకోవాలని, అత్యవసర సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని అధికార వర్గాలు తెలిపాయి. తేదీ మార్పుపై ఎటువంటి సందేహాలు లేకుండా అన్ని విభాగాలు ప్రభుత్వ తాజా ఉత్తర్వులను అనుసరించా లని సూచించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...