ఉద్యోగుల జీతాల చెల్లింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం

 

తెలంగాణలో ఉద్యోగుల జీతాలు చెల్లింపుపై  తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆధార్ లింక్ చేయని ఉద్యోగులకు శాలరీలు చెల్లించొద్దని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇవాళ అర్ధరాత్రి IFMIS పోర్టల్‌లో ఆధార్ వివరాలు లింక్ చేయాలని డెడ్‌లైన్ విధించింది. లేని పక్షంలో అక్టోబరు జీతం కట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. 

సుమారు 10.14 లక్షల మంది శాశ్వత, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు. ట్రెజరీ, వర్క్స్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్, ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలు అందరూ పాటించాలని రేవంత్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ లింక్ చేయని వారి అక్టోబరు జీతాలు నిలిపివేయాలని ఆదేశించింది. ఈ సర్క్యులర్‌పై ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సంతకం చేశారు. ఈ ఆదేశాలని ఉల్లంఘిస్తే తీవ్రంగా వ్యవహరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu