Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫ్యూచర్ సిటీకి వందేళ్ల నీటి భద్రత.!
posted on: Aug 7, 2026 2:40PM

హైదరాబాద్ మహానగరానికి అనుబంధంగా రూపుదిద్దుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తెలంగాణ ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తాగునీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికలను సిద్ధం చేసింది. 100 సంవత్సరాల పాటు నీటి భద్రతను కల్పించడమే లక్ష్యంగా గోదావరి, కృష్ణా నదీ జలాలను ఫ్యూచర్ సిటీకి తరలించేందుకు బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.
మల్లన్న సాగర్ జలాశయం నుంచి గోదావరి నీటిని, ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను ఫ్యూచర్ సిటీకి తరలించేలా రూట్ మ్యాప్ సిద్ధమైంది. 10 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధమైంది. అందులో భాగంగానే మల్లన్న సాగర్ నుంచి 15 టీఎంసీల నీటిని తరలించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ నీటిలో 10 టీఎంసీలను హైదరాబాద్ నగర అవసరాలకు ఉపయోగించగా, మిగిలిన 5 టీఎంసీల జలాలను ఫ్యూచర్ సిటీ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు వినియోగిస్తారు.
మరోవైపు.. నీటి శుద్ధీకరణ వ్యవస్థల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. దీనికోసం ఘన్‌పూర్ ప్రాంతంలో రోజూ 1,170 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన భారీ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్న ఈ శుద్ధీకరణ కేంద్రం ద్వారా శుద్ధి చేసిన స్వచ్ఛమైన నీటిని పైప్‌లైన్ ద్వారా ఫ్యూచర్ సిటీలోని అన్ని ప్రాంతాలకు నిరంతరాయంగా సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.
నగరాలు విస్తరిస్తున్న నేటి రోజుల్లో భవిష్యత్ అవసరాలను ముందే ఊహించి నీటి వనరుల మౌలిక వసతులను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. మల్లన్న సాగర్, ఉద్దండాపూర్ వంటి జలాశయాలను అనుసంధానం ద్వారా భవిష్యత్తులో నగరానికి నీటి కొరత అన్నదే లేకుండా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం సిద్ధమైన డీపీఆర్‌కు అనుగుణంగా త్వరలోనే పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాబోయే దశాబ్దాల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పెరిగే జనాభా, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నీటి లభ్యతకు కృష్ణా-గోదావరి నీటి తరలింపు ప్రాజెక్టు కీలకమని పరిశీలకులు అంటున్నారు.
Telangana Future City, Godavari and Krishna waters, Mallanna Sagar water, Uddandapur Reservoir, Ghanpur Water Treatment Plant






