Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇప్పుడు ఏం చెబుతారు కేసీఆర్..
posted on: Jan 9, 2016 4:59PM
.jpg)
తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది తమ ప్రాణాలను పణంగా పెట్టిన సంగతి తెలిసిందే. కనీసం రాష్ట్రం విడిపోయిన తరువాత అయిన తమ కష్ట్రాలు తీరిపోతాయి అని అనుకున్నారు చాలా మంది ఉద్యమకారులు. కానీ అప్పటికీ.. ఇప్పటికీ పెద్ద తేడా ఏం లేదనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మాత్రం ఉద్యమ కారులకు అది చేస్తాం..ఇది చేస్తాం అని ప్రగల్భాలు పలికిన నాయకులకు మాత్రం వాటి గురించి ఆలోచించే తీరిక లేదు. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది కాలంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి విదితమే. అయితే ఇప్పుడు అవి తగ్గాయి కదా అనుకునే లోపు మరో వర్గానికి చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన కరుణాసాగర్ అనే కళాకారుడు ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. కరుణాసాగర్ తెలంగాణ ధూం-ధాం కార్యక్రమాల్లో - తెలంగాణ సాధన యాత్రల్లో పాల్గొని ప్రదర్శనలు ఇచ్చేవాడు. దాదాపు 10 ఏళ్ల నుండి అనేక కార్యక్రమాల్లో పాల్గొని.. పాటలు రాయడమే కాకుండా పాడాడు కూడా. అయితే తెలంగాణ రాష్ట్ర వచ్చాక కళాకారుల కోటాలో సాంస్కృతిక శాఖలో ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాడు. కానీ నిరాశే ఎదురైంది. దాదాపు సంవత్సరకాలం పాటు ఎదురుచూసినా జాబ్ రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన కరుణాసాగర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు కరుణాసాగర్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అతని తల్లిదండ్రులు పుట్టుగుడ్డివారు.. నలుగురు అక్కచెల్లెళ్ళు మరో తమ్ముడు కూడా ఉన్నారు. కరుణాసాగర్ మృతితో తాము అనాథలమయ్యాయని ఆవేదన వ్యక్తి చేస్తున్నారు.
మరి కరుణాసాగర్ మృతితో అయినా కేసీఆర్ ఉద్యమంలో ఇచ్చిన హామీలు గుర్తుకొస్తాయో లేదో చూడాలి. కరుణాకర్ లాంటి ఎంతో మంది ఉద్యమకారుల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న సంగతి మరిచిపోయి.. ఎంత వరకూ రాజకీయ నాయకులు మాత్రమే పదవులు పొందుతూ ఉండటం కాదని తెలంగాణవాదులు అంటున్నారు. మరి కేసీఆర్ దీనికి ఏం సమాధానం చెబుతారో చూడాలి.






