Latest News

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

posted on: May 23, 2020 5:49PM

తెలంగాణలో ఎంసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఎంసెట్ ప్రవేశ పరీక్షను జులై 6 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి వెల్లడించారు. కరోనా నేపథ్యంలో, ప్రవేశ పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు.

జూలై 1న పాలీ సెట్, జూలై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్, జూలై 4న ఈసెట్, జులై 6 నుంచి 9 వరకు ఎంసెట్, జులై 10న లాసెట్ & లాపీజీ సెట్, 13న ఐసెట్, 15న ఎడ్‌సెట్ నిర్వహించనున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...