సోనియా సభ: తెలంగాణ కాంగ్రెస్‌లో అనువాద రాజకీయం

 

 

 

బుధవారం నాడు కరీంనగర్‌లో జరిగిన సోనియా సభ పేలవంగా జరిగిందని విమర్శకులు అనడానికి బలం ఇచ్చిన అంశం సోనియా ప్రసంగానికి అనువాదకుడు లేకపోవడం. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి నుంచీ కాంగ్రెస్ అగ్ర నాయకులు ఎవరు వచ్చినా ఉండవల్లి అరుణ్ కుమార్ అనువాద బాధ్యతలు తీసుకునేవారు. ‘గాంధీ’ కుటుంబం పావలా అంత ఎమోషన్‌తో మాట్లాడినా దాన్ని ఉండవల్ల రూపాయిన్నరంత ఎమోషన్‌తో అనువదించి ప్రసంగాన్ని రక్తి కట్టించేవారు.

 

ఉండవల్లి అనువాదం పుణ్యమా అని గతంలో గాంధీ కుటుంబం ఏ భాషలో మాట్లాడినా ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ వుండేది కాదు. అయితే ఇప్పుడు మారిన పరిస్థితులతో ఉండవల్లి అనువాదం చేసే అవకాశం లేకుండా పోయింది. కరీంనగర్‌లో సోనియా ప్రసంగాన్ని ఎవరూ అనువదించలేదు. దాంతో ఆమేం మాట్లాడిందో సభలో చాలామందికి అర్థం కాలేదు.



దాంతో సోనియాగాంధీ అంత దూరం నుంచి ఎండలో రొప్పుతూ వచ్చిన పని నెరవేరలేదు. సభ ముగిసిన తర్వాత సోనియా ప్రసంగాన్ని ఎవరైనా అనువదిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే దీనికి సంబంధించి ఆసక్తికమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. సోనియా ప్రసంగాన్ని అనువదించడానికి ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు ముందుకు వచ్చినప్పటికీ, కీలక నాయకులు వద్దని వారించినట్టు సమాచారం. సోనియా ప్రసంగాన్ని ఎవరైనా అనువదిస్తే, సదరు అనువదించిన వ్యక్తి సోనియా గాంధీ దృష్టిలో పడిపోయి,ఎక్కడ ఉండవల్లిలా ఎదిగిపోతారన్న ఉద్దేశంతో అసలు ఎవరూ అనువదించాల్సిన అవసరం లేదని అడ్డు వేసినట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu