హరీష్ రావు తండ్రి మృతి పట్ల సీఎం రేవంత్ సంతాపం

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, హరీశ్రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు.

హరీష్ రావు తండ్రి మృతి పట్ల పార్టీలకు అతీతంగా పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరీష్ రావుకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హరీష్ రావు నివాసానికి వెళ్లి, సత్యానారాయణకు నివాళులర్పించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా హరీష్ నివాసానికి చేరుకున్నారు. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కేసీఆర్ కు స్వయానా బావ అన్న సంగతి తెలిసిందే. పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu