ఎల్ అండ్ టి గాడ్గిల్‌కి కేసీఆర్ క్లాస్...
posted on: Sep 19, 2014 3:09PM

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఇక మా వల్ల కాదు బాబోయ్ అంటూ చేతులు ఎత్తేస్తూ ఎల్ అండ్ టి సంస్థ తెలంగాణ గవర్నమెంట్‌కి లేఖ రాయడం, అది మీడియాకి లీక్ కావడం, ఆ తర్వాత అందరూ నాలుకలు కరుచుకుని వివరణలు ఇవ్వడం తెలిసిందే. లేఖ లీక్ అయిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ని ఎల్ అండ్ టి మెట్రో రైల్ ఎండీ గాడ్గిల్ కలిసిన విషయం కూడా తెలిసిందే. గాడ్గిల్ కేసీఆర్ని కలిసిన సందర్భంలో కేసీఆర్ ఏం మాట్లాడారన్న విషయాలు కూడా మీడియాకి లీక్ అయ్యాయి. లేఖ లీక్ కావడం వల్ల యమా సీరియస్ అయిపోయిన కేసీఆర్ గాడ్గిల్ తన కార్యాలయంలోకి వచ్చీ రాగానే చాలా సీరియస్‌గా ఆయన మీద విరుచుకుపడినట్టు సమాచారం. ‘‘మీ నాటకాలు నాకు తెలుసు... లేఖ రాసేదీ మీరే.. దాన్ని మీడియాకి లీక్ చేసేదీ మీరే. ఆ తర్వాత మీకేమీ తెలియనట్టు మాట్లాడేదీ మీరు. ఇలాంటి పాలిటిక్స్ నా దగ్గర నడవవు. అయినా లేఖలో మీ ప్రాజెక్టుకు సంబంధించిన బాధలేవో చెప్పుకోవాలిగానీ, రాజకీయ అంశాలు ప్రస్తావించడమేంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడ్డం వల్ల హైదరాబాద్ వాల్యూ తగ్గిపోయిందని, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అవుతుందనే నమ్మకంతోనే ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయ్యామని ఆ లేఖలో ఎందుకు రాశారు? ఏంటీ రాజకీయాలు? మీ లెటర్‌లో హైదరాబాద్‌ని చాలా డ్యామేజ్ చేశారు. దీన్ని నేను ఉపేక్షించను. ఈ లెటర్ మీడియాకి లీక్ అయిన అంశం మీద విచారణ జరిపిస్తే ఏమవుతుందో ఆలోచించుకోండి’’ అని గాడ్గిల్‌ని కేసీఆర్ దులిపేసినట్టు తెలుస్తోంది. ఇంతకాలం తన జీవితంలో ఎప్పుడైనా చాలా మర్యాదపూర్వక సంభాషణలే చూసిన గాడ్గిల్ కేసీఆర్ క్లాసు దెబ్బకి ఖిన్నుడైపోయినట్టు తెలుస్తోంది.



.jpg)
.jpg)

.webp)



