Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గుత్తాకు కేసీఆర్ ఎందుకు కండువా కప్పలేదు..?
posted on: Jun 16, 2016 5:44PM

వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో దూసుకుపోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే టీడీపీ, వైసీపీ శాసన సభాపక్షాలను తనలో కలిపేసుకున్న టీఆర్ఎస్ తన నెక్ట్స్ ఫోకస్ కాంగ్రెస్‌పై పెట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బలంగా ఉన్న నల్గొండ జిల్లాలో దాని ఉనికిని లేకుండా చేసేందుకు పావులు కదిపారు కేసీఆర్. దీంతో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు నిన్న టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే పార్టీలో చేరాలనుకుంటున్న వారందరికి కేసీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అయితే ఎంపీ గుత్తాకు మాత్రం కేసీఆర్ గులాబీ కండువా కప్పలేదు. ఈ విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. దీని వెనుక అసలు కథ వేరే ఉంది ..టీఆర్ఎస్ కండువా కప్పుకున్నట్లైతే కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసే అవకాశాలుండటంతో కండువా కప్పే విషయంలో ఆచీతూచి వ్యవహరించాలని గుత్తా భావించారు. అందుకే కేసీఆర్ చేత కండువా వేయించుకోలేదు. కండువా కప్పుకున్నా..కప్పుకోకపోయినా గుత్తా టీఆర్ఎస్ సభ్యుడే.






