Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసులు
posted on: Mar 31, 2026 12:07PM
.webp)
బీఆర్‌ఎస్ నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు.వ చ్చే నెల 4న హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు.
ఈ ఏడాది జనవరి 29న హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంకలో జరిగిన మినీ మేడారం జాతర సందర్భంగా కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కూడా డిమాండ్ చేసింది.
కాగా ఆ ఘటనపై అప్పట్లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ఉన్నతాధికారులపై వ్యక్తిగత, మతపరమైన దూషణలకు దిగడం వంటి అంశాలపై నమోదైన కేసును సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఆ కేసులోనే సీఐడీ ఇప్పుడు కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.


.webp)



