తెలంగాణ ప్రభుత్వానికి 1500 కోట్లు టోకరా..

posted on: Jun 23, 2016 12:55PM


సామాన్య ప్రజలనే కాదు.. ప్రభుత్వాలకు కూడా బిల్డర్లు టోకరా వేసేస్తున్నారు. అలా తెలంగాణ ప్రభుత్వానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1500 కోట్లు టోకరా వేసేశారు బిల్డర్లు. అయితే ఇప్పుడు ఈ సొమ్మును వసూలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వ నడుంబిగించింది.

 

అసలు సంగతేంటంటే.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2001 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వంతో కలిసి పలు బిల్డర్లు హైదరాబాద్లో జాయింట్ వెంచర్లు ప్రారంభించారు. వాణిజ్య, నివాస ప్రాజెక్టుల పైన ఐదు శాతం షేర్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అనుకున్నట్టే 2004 నుండి 2008 మధ్యలో మొత్తం 19 వెంచర్లు ప్రారంభించగా అందులో ఒక్కటంటే ఒక్కటి మాత్రమే పూర్తయింది. మిగిలినవి కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.. కొన్ని మాత్రం మధ్యలోనే ఆగిపోయాయి. ఇక బిల్డర్లు ఇచ్చిన మాట కూడా గాల్లోనే కలిసిపోయింది. ప్రభుత్వానికి ఇస్తానన్న షేర్ ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, వ్యాట్ తదితర రూపాల్లో బిల్డర్లు ప్రభుత్వానికి రెవెన్యూ చెల్లించాల్సి ఉంది. అలాగే ఎల్ఐజీ ఇళ్ల నిర్మాణం రూపంలో ఏపీహెచ్‌బీకి సొమ్ము చెల్లించాల్సి ఉంది. సంవత్సరాల తరబడి ఈ విషయం పెండింగ్‌లో ఉండగా.. కళ్లు తెరిచిన తెలంగాణ ప్రభుత్వం బిల్డర్ల నుంచి బకాయిలు వసూలు చేయాలని గట్టి  నిర్ణయం తీసుకుంది. 9 మంది బిల్డర్లే ప్రభుత్వానికి దాదాపు 600 కోట్ల వరకు చెల్లించాల్సింది వుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరి బిల్డర్ల నుండి తెలంగాణ సర్కార్ సొమ్ము రాబట్టుకుంటుందో లేదో చూద్దాం..

google-ad-img
    Related Sigment News
    • Loading...