26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. 28న బడ్జెట్
posted on: Feb 19, 2026 11:53AM
.webp)
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారైంది. ఈ నెల 26 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు.
మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి 28న అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈసారి సభను 10 నుంచి 15 రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
బడ్జెట్ రూపకల్పనపై సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో శాఖల వారీగా ప్రీ బడ్జెట్ సమావేశాలను పూర్తి చేశారు. అన్ని శాఖల మంత్రులు, అధికారులతో మంత్రి భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహించారు. ఈనెల 23న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ కేబినెట్‌లో బడ్జెట్ సమావేశాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


.webp)
.webp)


