తెలంగాణ పోలీసుల ఆపరేషన్...81 మంది అరెస్ట్

 

తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఐదు రాష్ట్రాల్లో సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించింది. సైబర్‌ మోసాల్లో పాల్పడుతున్న 81 మందిని ఏపీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో పోలీసులు అరెస్ట్‌ చేశారు.

దర్యాప్తులో భాగంగా నిందితులపై దేశవ్యాప్తంగా 754 కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. మొత్తం రూ.95 కోట్ల విలువైన మోసాలు జరిపినట్లు తేలింది.

అరెస్టు చేసిన వారిలో 17 మంది ఏజెంట్లు, 7 మంది మహిళలు ఉన్నారు. అలాగే 58 మంది మ్యూల్‌ ఖాతాదారులు (మోసపూరిత డబ్బు బదిలీకి ఉపయోగించే వారు) ఉన్నట్లు గుర్తించారు.

వారి వద్ద నుండి 84 మొబైల్‌ ఫోన్లు, 101 సిమ్‌ కార్డులు, 89 బ్యాంకు పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఖాతాల్లో ఉన్న కోట్ల రూపాయల నగదును ఫ్రీజ్‌ చేశారు. ఈ మొత్తాన్ని బాధితులకు తిరిగి అందించే చర్యలు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో చేపడుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu