చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ ముగ్గురు మవోలు మృతి
posted on Nov 5, 2025 5:11PM

తెలంగాణ- చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లా మరికల్ అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు ఘటన స్థలం నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. ముగ్గురు నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల గరియాబంద్‌లో రూ.కోటి రూపాయల రివార్డు ఉన్న మావోయిస్టు మరణించిన సంగతి తెలిసిందే. గరియాబంద్ జిల్లాలోని మెయిన్‌పూర్ అడవుల్లో భద్రతా దళాల కాల్పుల్లో కీలక మావోయిస్టులు హతమయ్యారు. మెయిన్‌పూర్ ప్రాంత అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.