తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీ
posted on Oct 31, 2025 6:48PM
.webp)
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. 8 మంది ఐఏఎస్‌ల అధికారుల స్థానం చలనం చేశారు. ఫ్లాగ్‌షిప్ అభివృద్ధి కార్యక్రమాల అమలు విభాగం ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్/సంక్షేమశాఖ ప్రత్యేక సీఎస్‌గానూ కొనసాగనున్న సవ్యసాచి ఘోష్, రవాణా శాఖ కమిషనర్‌గా కే.ఇలంబర్తి/పశుసంవర్ధకశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు, గిరిజన సంక్షేమ కార్యదర్శి, కమిషనర్‌గా అనితా రామచంద్రన్‌కు అదనపు బాధ్యతలు, సీఎస్ వద్దే మెట్రో పాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ కార్యదర్శి బాధ్యతలు, జీఏడీ కార్యదర్శిగా ఇ. శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు, ఆయిల్‌ఫెడ్ ఎండీగా యాస్మిన్ బాషాకు అదనపు బాధ్యతలు, ఎస్సీ అభివృద్ధి కమిషనర్‌గా జి. జితేందర్ రెడ్డి/ఎస్సీ సహకార సంస్థ ఎండీగా అదనపు బాధ్యతలు కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.