Latest News
ఏడు గంటల పాటు గాల్లోనే.. ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం
posted on: Mar 27, 2026 12:22PM

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తి గాల్లోనే దాదాపు ఏడుగంటల పాటు చక్కర్లు కొట్టి చివరకు టేకాఫ్ తీసుకున్న చోటే ల్యాండ్ అయ్యింది. ఈ సంఘటన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం (మార్చి 26) జరిగింది.
ఢిల్లీ నుంచి లండన్ కు బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ తరువాత సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో దాదాపు ఏడు గంటల పాటు ప్రయాణించి చివరకు చివరకు ఎక్కడైతే టేకాఫ్ అయ్యిందో అక్కడే అంటే ఢిల్లీ విమానాశ్రయంలోనే ల్యాండ్ అయ్యింది. వాస్తవానికి ఈ విమానం లండన్లోని హీత్రూ విమానాశ్రయంలో దిగాలి.
కానీ విమానం సౌదీ గగనతలంలోకి ప్రవేశించిన తరువాత విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెనుదిరిగి ఢిల్లీకి చేరుకుంది. ఉదయం 6 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరిన ఈ విమానం మధ్యాహ్నం ఒంటిగంటకు అంటే ఏడు గంటల తరువాత తిరిగి ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంపై దర్యాప్తు కొనసాగుతోంది.






