మూడో టీ20లోనూ టీమ్ ఇండియా దారుణ పరాజయం.!

posted on: Jul 8, 2026 9:53AM

ఇంగ్లాండ్ తో ఐదు టి20ల సిరీస్ లో భాగంగా  ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా  మంగళవారం (జూన్ 7) జరిగిన మూడో టి20 మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది.   ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా..  ఆ తరువాత వరుసగా రెండు మ్యాచ్ లలోనూ టీమ్ ఇండియా పరాజయాలను మూటగట్టుకుంది. దంతో ఈ సిరీస్ లో ఇంగ్లాండ్  2-0తో ఆధిక్యంలో ఉంది. 

కాగా మంగళవారం జరిగిన  మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత  బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు సాధించింది.   ఆ జట్టు ఓపెనర్  ఫిల్ సాల్ట్ భారత బౌలర్లపై విరుచుకుపడుతూ   44 బంతుల్లో 70 పరుగులుచేశాడు.   జోస్ బట్లర్ 36 రాణించాడు.   చివర్లో శామ్ కర్రన్  24 బంతుల్లో 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ జట్టు సులువుగా 200 పరుగుల మార్కును దాటింది. భారత బౌలర్లలో  ప్రిన్స్ యాదవ్   30 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.  

 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా  బ్యాటింగ్ లైనప్ ఇంగ్లాండ్ పేస్ ధాటికి పేకమేడలా కూలిపోయింది. భారత బ్యాటర్లు ఎవరూ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్ల స్వింగ్, వేగానికి సమాధానం చెప్పలేక వరసగా వికెట్లు పారేసుకున్నారు. దీనితో   11.4 ఓవర్లలోనే 76 పరుగులకే  టీమ్ ఇండియా ఆలౌట్  అయ్యి 125 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది  ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 4 వికెట్లతో చెలరేగగా, జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు, ఆదిల్ రషీద్ 2 వికెట్లు తీశారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...