అండర్19 వరల్డ్ కప్.. ఫైనల్స్ కు దూసుకెళ్లిన టీమ్ ఇండియా
posted on: Feb 5, 2026 8:33AM

సెంచరీతో చెలరేగిన ఆరోన్ జార్జ్
మెరుపు హాఫ్ సెంచరీలతో వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ విధ్వంసం
టీమ్ ఇండియా యువ జట్టు అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్స్ కు దూసుకెళ్లంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా బుధవారం (ఫిబ్రవరి 4) జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఆఫ్ఘనిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ ఆరోన్ జార్జ్ (115) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా, వైభవ్ సూర్య వంశి, స్కిప్పర్ ఆయుష్ మాత్ర హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక శుక్రవారం (ఫిబ్రవరి 6) ఇదే వేదికపై జరిగే ఫైనల్ లో ఇంగ్లాండ్ తో తలపడుతుంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆప్ఘనిస్థాన్ బ్యాటర్లలో ఫైసల్ షినోజాడా 93 బంతుల్లో 110 పరుగులు, ఉజైరుల్లా నియాజీ 86 బంతుల్లో 101 నాటౌట్ అద్భుత సెంచరీలతో కదం తొక్కడంతో ఆప్ఘన్ స్కోరు బోర్డు పరుగులెత్తింది. భారత బౌలర్లలో కనిష్క్, చౌహాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మిగిలిన బౌలర్లెవరూ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు.
311 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమ్ ఇండియా అండర్ 19 జట్టు కేవలం 41.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. తొలి వికెట్‌కు జార్జ్, సూర్యవంశీ 90 పరుగులు జోడించగా, రెండో వికెట్‌కు జార్జ్, కెప్టెన్ ఆయూష్ మాత్ర 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక మూడో వికెట్‌కు విహాన్ మల్హోత్రా (47 బంతుల్లో 38 నాటౌట్)తో కలిసి జార్జ్ మరో 96 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ విజయంతో భారత్ పదోసారి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌కు అర్హత సాధించినట్లైంది. అలాగే టీమ్ ఇండియా అండర్ 19 వరల్డ్ కప్ లో ఫైనల్స్ కు చేరడం ఇది వరుసగా ఆరోసారి


.webp)



