Latest News

నేడే భారత్, కివీస్‌ 3వ టీ20 మ్యాచ్‌

posted on: Jan 25, 2026 12:39PM

 

గువాహటి వేదికగా నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య  3వ టీ20 జరగనుంది. ఇప్పటికే రెండు టీ20లు గెలిచి జోరు మీద ఉన్న టీమిండియా  3వ టీ20 పై కన్నేసింది.  ఎలాగైనా ఈ టోర్నమెంట్ లో బోణీ కొట్టాలన్న కసితో కివీస్ ఉంది. భారత వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ లో రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాట్లు తెలుస్తోంది. చేతికి గాయం అయిన నేపథ్యంలోనే రెండవ టీ20కి దూరమై, ఇవాళ్టి మ్యాచ్ లో మాత్రం ఆడుతున్నాడని స‌మాచారం. అదే సమయంలో డేంజ‌ర్ బౌల‌ర్‌ బుమ్రాను కూడా తీసుకుంటారట. మొన్న అర్షదీప్ సరిగ్గా బౌలింగ్ చేయలేదు. దీంతో అతడిని తప్పించి బుమ్రాను తీసుకుంటారని అంటున్నారు. ఇటు అక్షర్ పటేల్ బరిలోకి దిగితే, వరుణ్ చక్రవర్తి లేదా కుల్దీప్‌ పైన వేటు పడే అవకాశం ఉంది. 

రాయ్‌పుర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. టీ20 క్రికెట్ చరిత్రలో 200 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 209 పరుగులను మరో 28 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా పూర్తి చేసింది. అంతకు ముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉండేది. సుదీర్ఘ కాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన ఇషాన్ కిషన్(రెండో టీ20లో విధ్వంసం సృష్టించాడు. 

కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి.. న్యూజిలాండ్‌పై వేగవంతమైన టీ20 అర్ధశతకాన్ని సాధించిన భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. కాగా ఇషాన్ మొత్తం 32 బంతుల్లోనే 76 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. గత కొంత కాలంతో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న స్కై.. 463 రోజుల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ బాదాడు. ఓపెనర్లు త్వరగా పెవిలియన్ చేరినప్పటికీ.. సూర్య కెప్టెన్ నాక్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.భారత గడ్డపై టీమిండియా ఆడిన 100వ టీ20 మ్యాచ్ ఇది. రాయ్‌పుర్ వేదికగా జరిగిన ఈ మైలురాయి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన టీమిండియా.. తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మరోవైపు 200కి పైగా లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా ఛేదించడం ఇది ఆరో సారి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా(7 సార్లు) అగ్రస్థానంలో ఉంది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...