టీఆర్ఎస్ కు టీడీపీ రివర్స్ పంచ్.. ఆపరేషన్ స్వగృహా

posted on: Jan 9, 2016 8:51AM

ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదన్న విషయం రాజకీయానుభవం ఉన్న ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. ఒక పక్క ఎన్నికల్లో విజయ పరంపర సాగిస్తూనే.. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పలువురు పార్టీ నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటూ.. మరోవైపు ప్రచారంలో జోరు సాగిస్తూ ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా చేస్తుంది. దీంతో ఏ పార్టీ నాయకుడు ఎప్పుడు షాక్ ఇస్తాడో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి టీడీపీ రివర్స్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ తరహాలో.. టీడీపీ కూడా ఆపరేషన్ స్వగృహా అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది .ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా టీఆర్ఎస్ పార్టీ ఇతర నతేలను తమ పార్టీ లోకి చేర్చుకుంటారు. అయితే ఆపరేషన్ స్వగృహా ద్వారా పార్టీని విడిచి వెళ్లిపోయిన వారంద‌రినీ తిరిగి పార్టీలో చేర్చుకుంటుంది. దీనిపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ `ఆపరేషన్ స్వగృహ` ప్రారంభించిందని.. హైదరాబాద్ లో, తెలంగాణలో పార్టీని వీడి వెళ్లిపోయినవారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్ల‌డించారు. అయితే దీనికి కూడా మంచి రెస్పాన్సే వచ్చినట్టు కనిపిస్తోంది. అలా ప్రారంభించారో లేదో.. గతంలో పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎల్బీనగర్ నుంచి ఎస్.వి.ప్ర‌సాద్, శేరీలింగపల్లి నుంచి నార్నె శ్రీనివాస్, కుకట్ పల్లి నుంచి గోనె శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు టీడీపీలో చేరారు.  దీంతో ప్రారంభించిన వెంటనే మంచి రెస్పాన్స్ వచ్చింనందుకు గాను టీడీపీ నేతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారంట.

మొత్తానికి ఆపరేషన్ ఆకర్ష్ కు ధీటుగా టీడీపీ నేతలు ఆపరేషన్ స్వగృహాను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా టీఆర్ఎస్ కు గట్టిగానే సమాధానం ఇచ్చారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...