Latest News
షోకాజ్ నోటీసుకు తెలుగుదేశం ఎంపీ పుట్టా మహేష్ వివరణ!
posted on: Mar 21, 2026 12:25PM

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ పుట్టామహేష్ తనకు తెలుగుదేశం హైకమాండ్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చారు. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీకి వెళ్లినదానిపై పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసులో ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలనీ, అప్పటి వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనీ పుట్టా మహేష్ ను పార్టీ అధిష్ఠానం ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పార్టీ తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసులు ఎంపీ పుట్టా మహేష్ లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు. కాగా పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పుట్టా మహేష్ యాదవ్ తన వివరణను అధిష్టానానికి పంపారు. ఆ వివరణలో తనకు డ్రగ్స్ వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేదని పుట్టా పేర్కొన్నట్లు చెబుతున్నారు. పార్టీకి రమ్మని ఆహ్వానిస్తే వెళ్లాననీ, తాను డ్రగ్స్ తీసుకోలేదని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా పుట్టా మహేష్ ఇచ్చిన వివరణతో పార్టీ సంతృప్తి చెందుతుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. కాగా ఈ విషయంలో పార్టీ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది.



.webp)


