Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కల్తీ నెయ్యి వ్యవహారంపై టీడీపీ భారీ నిరసన ర్యాలీ
posted on: Jan 29, 2026 2:57PM

తిరుపతిలో తెలుగుదేశం పార్టీ భారీ స్థాయిలో నిరసన ర్యాలీ నిర్వహించింది.“మహా పాపం నిజం… అది నెయ్యే కాదు” అనే నినాదంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి కల్తీ నెయ్యి వ్యవహారానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. నాలుగుకాళ్ల మండపం వద్ద మానవహారం ఏర్పాటు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ
వైసీపీ పెద్దలు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. జంతువుల కొవ్వుతో తయారు చేసిన సింథటిక్ ఘీతో దాదాపు 20 కోట్ల లడ్డూ ప్రసాదాలు తయారు చేశారన్నారు. దీనివల్ల కోట్లాది భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని విమర్శించారు.
టీడీపీ నేత సుగుణమ్మ మాట్లాడుతూ…
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్నది నిజమని, ఈ విషయాన్ని సిట్ ఆధారాలతో బయటపెట్టిందన్నారు. కల్తీ జరగలేదని భూమన కరుణాకర రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. కోట్ల రూపాయల అవినీతి జరిగిందా లేదా అన్నది భూమనే ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. దేవుడి కంట్లో పడితే ఎవరికైనా అంతు తప్పదని హెచ్చరించారు.
టీడీఏ చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ…
వైసీపీ పాలనలో ఐదేళ్ల పాటు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అరాచకాలు జరిగాయని ఆరోపించారు. టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వ్యక్తులు అవినీతికి పాల్పడ్డారని, శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించి భక్తులను బాధపెట్టారని విమర్శించారు. ఈ వ్యవహారంలో వైసీపీ బడా నాయకుల ప్రమేయం ఉందని, కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తేలిపోయిందన్నారు.
భక్తులు తిరుపతి లడ్డూను ఎంతో పవిత్రంగా భావించి స్వీకరిస్తారని, అలాంటి ప్రసాదంలో కల్తీ జరగడం ఘోరమైన నేరమని టీడీపీ నేతలు అన్నారు. వైసీపీ నాయకులు ఇకనైనా తప్పు ఒప్పుకోవాలని, వేంకటేశ్వర స్వామి వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని వారు ప్రార్థించారు.


.webp)



