ఆ మినిస్టర్స్ కి సంక్రాంతి సంబరాలు లేనట్టేనా?

posted on: Sep 30, 2016 11:56AM

ఏపీ క్యాబినేట్లో ఇప్పుడంతా టెన్సన్ టెన్షన్ గా వుంది! కారణం సీఎం చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ నిర్ణయమే! విస్తరణ అంటే కొత్త ముఖాలు వుంటాయి అని హాయిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు అమాత్యులకి! ఇప్పుడున్న వారిలో కొందరికి ఉద్వాసన కూడా తప్పదని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదీగాక క్యాబినేట్ ఏర్పాటై రెండున్నరేళ్లు కావొస్తోంది కాబట్టి మార్పులు, చేర్పులు, తీసివేతలు, ఏరివేతలు మామూలే కూడా... 
టీమ్ చంద్రబాబులో ప్రస్తుతం ఆయనతో సహా ఇరవై మంది మంత్రులు వున్నారు. అయితే, వీరిలో కొందరికి ఎగ్టిట్ తప్పదని ఈ మధ్య చంద్రబాబే స్వయంగా సూచించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పర్ఫామెన్స్ బాగా వున్నా వారికి ప్రమోషన్ వుంటుందనీ... లేని వారికి మంత్రి పదవి ఊడుతుందని ఆయన అటుఇటుగా చెప్పేశారు. కాబట్టి, ఎన్నికలు పూర్తయ్యాక , అంటే, జనవరిలో కొందరు మంత్రులపై వేటు వుండే అవకాశం వుంది. అయితే, వారెవరో ఆల్రెడీ బాబు నిర్ణయించుకున్నారని కూడా టాక్ నడుస్తోంది. మొత్తం అయిదుగురు మినిస్టర్స్ బ్యాగ్ లు సద్దుకోవాల్సి రావచ్చని టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. వాళ్లెవరో ఇంకా క్లారిటీ లేకున్నా ఒక లేడీ మినిస్టర్ కూడా పదవి కోల్పోయే పరిస్థితిలో వుందంటున్నారు!
నిజానికి దసరా టైం కల్లా మంత్రవర్గ విస్తరణ వుంటుందని తొలుత అనుకన్నారు. కాని, త్వరలో ఎన్నికలు వచ్చిపడటంతో క్యాబినేట్ రీషపుల్ జనవరి దాకా వాయిదా పడింది. అయితే, అప్పుడు మాత్రం ఇప్పుడున్న వారిలో ఒక అయిదు మంది ఔటై కొత్త వారు పది మంది దాకా ఇన్ అవుతారంటున్నారు. వీళ్లను కులాలు, ప్రాంతాలు, జిల్లాల ఆధారంగా అన్నీ లెక్కలు సరిచూసుకుని ముఖ్యమంత్రి టీమ్ లోకి తీసుకుంటారని చెబుతున్నారు. వీళ్లలో వైసీపీ నుంచి వచ్చిన వలస ఎమ్మేల్యేలు కూడా వుండే ఛాన్స్ వుందట!
 

google-ad-img
    Related Sigment News
    • Loading...