Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మోదీతో బ్రిటన్ ప్రధాని చర్చలు... టాటా స్టీల్ గురించేనా!
posted on: Mar 31, 2016 5:32PM

అమెరికాలో జరగనున్న అణుభద్రత సదస్సులో పాల్గొనేందుకు ఇటు భారత ప్రధాని మోదీ, అటు బ్రిటన్ ప్రధాన కెమెరూన్ వాషింగ్టన్‌కు చేరుకున్నారు. పనిలో పనిగా ఈ సమావేశంలో కెమెరూన్, బ్రిటన్‌లోని టాటాస్టీల్ సంక్షోభం గురించి కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇంగ్లండులోని సౌత్‌వేల్స్ ప్రాంతంలో టాటా యాజమాన్యానికి భారీ స్టీల్ కర్మాగారం ఉంది. అయితే రోజురోజుకీ ఈ కర్మాగారం నుంచి లాభాలు రాకపోగా, కోట్లకొద్దీ నష్టాలు వాటిల్లడం మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో వస్తున్న మార్పులు, చైనా నుంచి ఐరోపాకు కారుచౌకగా స్టీలు ఎగుమతి కావడం తదితర అంశాల వల్ల, ఆ కర్మాగారం సంక్షోభంలో పడిపోయింది.
దాంతో ఈ కర్మాగారాన్ని మూసివేయాలని టాటా యాజమాన్యం నిర్ణయించుకుంది. అయితే ఈ నిర్ణయం వల్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దాదాపు 40 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడతారని అంచనా. అందుకే మూసివేత గురించి వదంతులు వినిపించగానే బ్రిటన్ ప్రధాని కెమెరూన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఎక్కడెక్కడి అధికారులో ఆదరాబాదరాగా ఈ సమావేశంలో పాల్గొనేందుకు లండన్ చేరుకున్నారు. నయానో భయానో ఈ కర్మాగారం మూతపడకుండా చూడాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం దొరికేదాకా టాటా యాజమాన్యం కాస్త ఓపికపట్టేలా చూడాలని కొందరు సూచించారట. ఇప్పటికే కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు టాటాలతో సంప్రదింపులు జరిపేందుకు ఇండియాకు చేరుకున్నారు. మరో పక్క, ఈ సంక్షోభాన్ని నివారించేందుకు మోదీ కూడా చొరవ తీసుకోవాలంటూ, బ్రిటన్ ప్రధాని కెమెరూన్ కూడా అభ్యర్థించనున్నారని తెలుస్తోంది. ఓడలు బళ్లుగా మారడం అంటే ఇదేనేమో!



.jpg)


