Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్యకేసులో ట్విస్ట్
posted on: May 10, 2026 4:49PM

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో రిటైర్ట్ ఐపీఎస్ అధికారి వినయ్‌రంజన్ రే భార్య భార్య తనూజ(60) హత్యకేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న నేపాలీ పనిమనిషి కల్పన హత్యానంతరం నాగపూర్ రైలెక్కి పారిపోతూ, మార్గమధ్యంలోనే దిగిపోయిన పోలీసులకు టోకరా ఇచ్చింది. గురువారం అర్థరాత్రి దాటాక జరిగిన ఈ హత్యోదంతంలో తనూజ ఊమిరాడని స్థితిలో ప్రాణాలొదిలినట్టు పోస్టుమార్టం నివేదకలో తేలింది. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నివాసం ఉండే చోట భద్రత పకడ్బందీగా ఉంటుంది. నిత్యం పోలీసుల గస్తీ ఉండే ప్రాంతంలో పోలీసు అధికారి కుంటుంబంలోనే దారుణం జరగడం కలకలం రేపుతోంది.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకునన పోలీసు అధికారులు పదికి పైగా బృందాలను రంగంలోకి దింపారు. 200కు పైగా సీసీ టీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలించిన అధికారులు ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ టీంని నేపాల్ సరిహద్దులకు పంపినట్లు తెలిసింది. ప్రధాన నిందితురాలు కల్పనతో పాటు మరో ఇద్దరు నాంపల్లిలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కారని తెలిసి, సోదాలు ప్రారంభించిన పోలీసులకు వారు మార్గ మధ్యంలోనే దిగిపోయి టోకరా ఇచ్చినట్లు తెలిసింది. ఆ క్రమంలో కల్పనతో సన్నిహితంగా మెలిగిన పలువురు నేపాలీ మహిళలను అదుపులోకి ప్రశ్నిస్తున్నారు.
వినయ్ రంజన్ చికిత్స కోసం బెంగళూరు వెళ్లిన తర్వాత ఇంట్లో నుంచి కల్పిన ఎక్కువ సమయం పోన్లో మాట్లాడినట్లు సీసీ కెమెరాల ఫుటేజి ద్వారా పోలీసులు అంచనాకు వచ్చారు. ఘనటాస్థలంలో స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లలో నెంబర్ల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. కల్పన ముందస్తు పథకం ప్రకారమే ఇంటో పనిమనిషిగా చేరి అందినంత దోచుకుని పోయినట్లు నిర్థారణకు వచ్చారు. కల్పన పనిలో చేరినప్పటి నుంచి, హత్యా, దోపిడీ చేసి పారిపోయే వరకు బయట నుంచి వచ్చిన ఆదేశాల మేరకే నడుచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.



.webp)


