Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తమిళనాడు సీఎం విజయ్.. రూటే సెపరేటు.!
posted on: Aug 8, 2026 12:27PM

మౌనాన్ని మించిన ఆయధం లేదని తమిళనాడు సీఎం విజయ్ నిరూపించారు. సాధారణంగా పొలిటీషియన్లు తమపై వచ్చే ఆరోపణలు, వ్యక్తిగత వివాదాపై తీవ్రంగా స్పందిస్తుంటారు. ప్రజల్లో తమ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకు మీడియా ముందుకొచ్చి ఖండనలు, వివరణలు, ప్రత్యర్థులపై విమర్శలు వంటివి చేస్తారు. అయితే.. ఈ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత దళపతి విజయ్ మాత్రం తన రూటే సెపరేటు అంటున్నారు.
రాజకీయ విమర్శలు, వ్యక్తిగత జీవితంలో వివాదాలు ఎదురైన సమయంలో కూడా ఆయన స్పందన పెద్దగా కనిపించలేదు. ప్రత్యర్ధులపై తీవ్ర విమర్శలకు దూరంగా ఉండే ఆయన తీరు రాజకీయవర్గాలలో ప్రశంసలు అందుకుంటోంది. ఓపిక, సహనం, మాటల యుద్ధాలకు దూరంగా ఉండే విజయ్ వైఖరి ఆయనకు పొలిటికల్ గానూ, పర్సనల్ గానూ కూడా బాగా కలిసివస్తోందని చెప్పవచ్చు.
గతంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో విజయ్ కుటుంబ జీవితంలో పెద్ద వివాదం తలెత్తింది. ఆయన భార్య సంగీత విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిని ప్రత్యర్థులు విజయ్ ను మానసికంగా దెబ్బ తీయడానికీ, ఆయన ప్రజాదరణను తగ్గించడానికీ వాడుకున్నాయి. సొంత కుటుంబాన్నే సరిగ్గా నిర్వహించలేకపోయిన వ్యక్తి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఎలా మారుస్తారంటూ విపక్ష నాయకులు విమర్శలు గుప్పించారు.
అయినా విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు. ఆ సమయంలో ఆయన తన కుటుంబంపై గానీ, భార్యపై గానీ ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు. విజయ్ చూపిన ఆ పరిణితి ప్రజల్లోనూ విజయ్ పట్ల గౌరవాన్ని పెంచిందని చెప్పవచ్చు. ఒత్తిడి ఉన్న సమయంలో కూడా నిగ్రహాన్ని కోల్పోకుండా ఉండటం ద్వారా ఆయన తనపై వస్తున్న విమర్శలన్నింటికీ సమాధానం ఇచ్చినట్లయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Tamilnadu CM, Thalapathy Vijay, Tamil Nadu Politics, Vijay Sangeetha Divorce Case, Vijay Political Strategy, Upperhand, Opposition






