Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విజయకాంత్ ఒంటరి పోరుతో ఎవరికి మేలు!
posted on: Mar 11, 2016 9:24AM

తమిళనాట రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. డీఎంకే, అన్నాడీఎంకే ముఖ్యపార్టీలుగా ఉన్న ఆ రాష్ట్రంలో, విజయ్‌కాంత్ నెలకొల్పిన డీఎండీకే కూడా ఎంతో కొంత ప్రభావం చూపించేది. క్రితంసారి అసెంబ్లీ ఎన్నికలలో అయితే అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఏకంగా 29 సీట్లను కైవసం చేసుకుంది డీఎండీకే. అలా అసెంబ్లీలోనే రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. గత ఎన్నికలలో డీఎండీకే సత్తా చూసినవారంతా ఈసారి ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తహతహలాడారు. బీజేపీ కేంద్ర మంత్రి జవదేవ్‌కర్ స్వయంగా చెన్నైకు వచ్చి విజయ్‌కాంత్‌తో పొత్తుల గురించి కదిపారు. ఆ సమావేశం ముగిసిన కొద్దరోజులపాటు బీజేపీతో విజయ్‌కాంత్ కలిసి నడవడం ఖాయం అనుకున్నారంతా! కానీ ఇంతలో డీఎంకే పెద్దాయన కరుణానిధి రంగంలోకి దిగి విజయ్‌కాంత్ తమతో కలిసి పోటీ చేసే అవకాశం ఉందని ప్రకటించారు. ఇంతకీ విజయ్‌కాంత్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారా అని రకరకాల ఊహాగానాలు వినిపిస్తుండగానే... తాను ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించి సంచలనానికి తెరదీశారు.
పైకి గొప్పగా కనిపించే ఈ నిర్ణయం నిజానికి నష్టదాయకమని ప్రతిపక్షాలు వాపోతున్నాయి. విజయ్‌కాంత్ పార్టీ కనుక రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తే ప్రతిపక్షాలకు రావల్సిన ఓట్లన్నీ చీలిపోతాయనీ, దాంతో అన్నాడీఎంకేకు తిరుగులేకుండా పోతుందని తలలు పట్టుకుంటున్నాయి. కానీ విజయ్‌కాంత్ మాత్రం తాము తమిళనాట ఉన్న రెండు పార్టీలకూ అతీతంగా మరో ప్రత్యామ్నాయాన్ని చూపించి తీరతామని శపథం చేస్తున్నారు. మరి ఈ కెప్టెన్ తన నౌకను విజయతీరాలకు నడిపిస్తారా లేకపోతే తాను మునిగి మిగతా ప్రతిపక్షాలను కూడా ముంచుతారా చూడాలి!


.jpg)
.jpg)


