Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మమ్మల్ని భారత్ తీసుకెళ్లండి.. మోడీకి ఇరాన్ లోని ఇండియన్ విద్యార్థుల మొర
posted on: Mar 1, 2026 5:41AM

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ భీకరదాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ముఖ్యంగా ఇరాన్ లో విద్యనభ్యసిస్తున్న భారత విద్యార్థులు తమను క్షేమంగా భారత్ తీసుకు వెళ్లాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్రమోడీని కోరుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని భయాందోళనల్లో క్షణమొక యుగంగా గడుపుతున్నామంటూ వారు పేర్కొంటున్నారు. శనివారం (ఫిబ్రవరి 28) ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు ఇరాన్‌పై భీకర దాడులు చేస్తున్నాయి. ఎటు చూసినా బాంబులు, మిస్సైళ్లు, డ్రోన్లు పేలిన శబ్దాలే వినిపిస్తున్నాయి.
ఈ దశలో పరిస్థితి మరింత క్షీణించకముందే.. భారత్ కు వచ్చేయాలని అక్కడి విద్యార్థులు తహతహలాడుతున్నారు. తమను ఎలాగైనా ఇరాన్ నుంచి ఇండియాకు తీసుకు వెళ్లాలని కన్నీళ్లతో వేడుకుంటున్నారు. ఇందుకు సంబంధించి టెహ్రాన్ లో ఉంటున్న ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియోలో భారీ పేలుళ్ల శబ్దాలు స్పష్టంగా వినిపించాయి.
ఇలా ఉండగా టెహ్రాన్ లో పలు చోట్ల బాంబుదాడులు జరిగాయి. ఇరాన్ ను విడిచి వెళ్లాల్సిందిగా ఇండియన్ అంబసీ గతంలోనే సూచించినప్పటికీ పలువురు విద్యార్థులు పరీక్షలు అయిన వెంటనే వెళ్లిపోతామంటూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులను చూసి భయంతో వణికి పోతున్నా ఇండియన్ స్టూడెంట్స్.. యుద్ధంగా ఆగినా కూడా ఇక ఇరాన్ లో మాత్రం ఉండబోమని అంటూ తక్షణమే తమను భారత్ కు తీసుకువెళ్లండంటూ వేడుకుంటున్నారు.



.webp)


