టీ20 వరల్డ్ కప్‌లో సరికొత్త రికార్డు

posted on: Mar 4, 2026 2:55PM

 

టీ20 ప్రపంచకప్ 2026 సరికొత్త రికార్డు సృష్టించింది. భారత్‌లో ఈ వరల్డ్ కప్  టోర్నమెంట్‌ను వీక్షించిన వారి సంఖ్య 50 కోట్లు దాటడం విశేషం. ఇది టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధికం. వీక్షకుల సంఖ్య 500 మిలియన్లను దాటింది. జియో హాట్ స్టార్‌లోనూ 60.5 మిలియన్ల గరిష్ఠ స్థాయికి వ్యూయర్ల సంఖ్య చేరింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా 'ఎక్స్' వేదికగా తెలిపారు. ఈ టోర్నమెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తృతం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించామని, భారత్‌లో 50 కోట్ల వ్యూయర్‌షిప్ దాటడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.  

నాకౌట్ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ ప్రేమతో మరిన్ని రికార్డులు బద్దలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.సెమీ ఫైనల్స్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. మరో సెమీస్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నేడు న్యూజిలాండ్, సౌత్‌ఫ్రికా తలపడనున్నాయి. ఇక‌, ఐసీసీ అధికారిక స్ట్రీమింగ్ సర్వీస్ ఐసీసీ.టీవీ కూడా నయా రికార్డులు సృష్టించింది. 2024 ఎడిషన్‌తో పోలిస్తే వినియోగదారులు 28 శాతం, వీక్షణ సమయం 56 శాతం పెరిగింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వీడియో వ్యూస్ ఇప్పటికే 10 బిలియన్లు దాటాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...