టీ20 ప్రపంచ కప్...యూఏఈపై సౌతాఫ్రికా ఘన విజయం
posted on: Feb 18, 2026 2:09PM

టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. తొలుత యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. అనంతరం సౌతాఫ్రికా 13.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. సపారీల బ్యాటర్లలో రికెల్‌టన్ (30), మార్‌క్రమ్ (28), బ్రెవిస్ (36) రన్స్ చేశారు. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ, జవాదుల్లా, అర్పాన్, షరూఖ్ తలో వికెట్ తీశారు. గ్రూప్ దశలో ఓటమి ఎరుగని దక్షిణాఫ్రికా ఇప్పటికే సూపర్-8కి చేరుకుంది. యూఏఈ టోర్ని నుంచి ఎలిమినెట్ అయింది. సూపర్-8లో టీమిండియాతో సౌతాఫ్రికా ఫిబ్రవరి 22న తలపడనున్నది



.webp)


