పసికూనపై ఆస్ట్రేలియా పరాజయం

posted on: Feb 13, 2026 1:55PM

 

 

టీ20 ప్రపంచ కప్‌లో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియాపై జింబాబ్వే 23 పరుగులతో తేడాతో ఘన విజయం సాధించింది.  ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.

బెన్నెట్(64) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మారుమణి(35), ర్యాన్(35), సికందర్ రాజా(25*) రాణించారు. ఆసీస్ బౌలర్లలో గ్రీన్, స్టాయినీస్ చెరొక వికెట్ పడగొట్టారు.ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా చేరుకోవడంలో విఫలమైంది. కేవలం 19. 3 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. 2007లో జరిగిన మ్యాచ్‌లో కంగారూలపై జింబాబ్వే విజయం సాధించింది. 19 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీటైంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...