ఉత్కంఠగా సాగిన రెండో సూపర్‌ ఓవర్‌లో సౌతాఫ్రికా విజయం

posted on: Feb 11, 2026 2:45PM

 

అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆఫ్గానిస్థాన్ మధ్య పోరు ఉత్కంఠగా సాగి మ్యాచ్ టై అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 187/6 పరుగులు చేసింది. 188 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గాన్..19.4 ఓవర్లలో 187 పరుగులకే ఆలౌట్ కావడంతో స్కోర్లు సమనయ్యాయి.  అయితే అనూహ్యంగా సూపర్ ఓవర్‌లోనూ రెండు జట్లు 17 - 17 పరుగులు చేశాయి. 

రెండో ఓవర్లో సౌతాఫ్రికా బ్యాటర్లు అదగొట్టారు. ఆరు బంతుల్లో ఏకంగా 23 పరుగులు చేశారు. 24 పరుగుల లక్ష్య చేధనలో ఆప్ఘాన్ బ్యాటర్లు సైతం రఫ్పాడించారు. ఆరు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి.. 19 పరుగులు చేశారు. దీంతో సాఫారీ జట్టు విజయం సాధించింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...