Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై సుస్మిత వ్యాఖ్యలు వైరల్.. భయపెట్టాడనేది నిజం
posted on: Mar 10, 2026 3:45PM

-మన శంకర వరప్రసాద్ గారు తో జోష్ లో ఉన్న సుస్మిత '
-మెగా డాటర్ నుంచి మెగా ప్రొడ్యూసర్
-పవన్ కళ్యాణ్ గురించి స్పీచ్
సుస్మిత కొణిదెల(Sushmita Konidela).. ఇప్పుడు ఓన్లీ సుస్మిత కొణిదెల కాదు మెగా ప్రొడ్యూసర్ . మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)డాటర్ గా ఎంట్రీ ఇచ్చి, తండ్రి టోటల్ సినీ కెరీర్ కే 'మన శంకర వరప్రసాద్ గారు' తో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చే స్థాయికి ఎదిగింది. కలెక్షన్స్ పరంగా కూడా మొట్టమొదటి తెలుగు ప్రాంతీయ సినిమా. దీన్నిబట్టి చిరంజీవి నే సుస్మిత కి గౌరవం ఇవ్వాల్సిన సినీ పరిస్థితి. మరి ఇంత అదృష్టం ఎవరికి వస్తుంది చెప్పండి. అభిమానుల ఆనందం అయితే అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ తో కూడా సినిమాలు చేయమనే డిమాండ్ పురుడు పోసుకొని చాలా రోజులే అవుతుంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి సుస్మిత మాట్లాడిన మాటలు వాళ్ళ జోష్ ని మరింత తీసుకొస్తున్నాయి. మరి అవేంటో చూద్దాం.
సుస్మిత రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు నా చిన్నప్పటి నుంచి నాతో పాటు మా ఇంట్లో ఉండే పిల్లలందరితో బాబాయ్ చాలా సరదాగా గడిపే వారు. నా వరకు ఆయన కేవలం బాబాయ్ మాత్రమే కాదు, ఒక బ్రదర్. సినిమాలంటే ఆసక్తి కలిగేలా చేసింది కూడా బాబాయ్ నే. నాతో పాటు రామ్‌చరణ్(Ram Charan)మిగతా పిల్లలందర్నీ కూర్చోబెట్టి హర్రర్ కథలు చెప్పేవారు. నాకు హర్రర్ కథలంటే చాలా ఇష్టం ఉండటంతో శ్రద్దగా వినేదాన్ని. కానీ మిగతా పిల్లలు భయపడి మధ్యలోనే వెళ్లిపోయేవారు. బాబాయ్ దగ్గర ది గాడ్ ఫాదర్, స్టార్ వార్స్ లాంటి సినిమాల క్యాసెట్స్ ఉండేవి. అసలు హాలీవుడ్ సినిమాలని పరిచయం చేసింది బాబాయినే. ఇంగ్లీష్ మ్యూజిక్ కూడా ఆయనే మాకు వినిపించేవారు. అలాకొత్త ప్రపంచాన్ని చూపించారు.
also read: ప్రేమికులు పిచ్చి పిచ్చిగా పాడుకుంటున్న పాట.. 316 మిలియన్ల వ్యూస్
బాబాయ్ ఏ డ్రెస్ వేసుకున్నా అది వెంటనే ట్రెండ్ అవుతుంది. ఆయన స్టైల్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆధ్యాత్మికత, తాత్వికత పాళ్ళు చాలా ఎక్కువ. . ఆ విషయాలు మమ్మల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాయని సుస్మిత చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ మాటలు అభిమానులని అలరిస్తున్నాయి. పవన్ తో సినిమా చెయ్యాలనే డిమాండ్ ఇంకా పెరిగింది.






