Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మనకు పాక్ వల్ల సమస్యలు కాదు… పాకిస్తానే సమస్య!
posted on: Apr 11, 2017 7:06PM

1947లో స్వాతంత్ర్యం పొందిన భారతదేశానికి నిజంగా స్వేచ్ఛ లభించిందా? కాదనే చెప్పాలి. అందుక్కారణం… పక్కలో బల్లెంలా గుచ్చుకుంటూ వస్తోన్న పాకిస్తానే! ఆర్దిక రంగం నుంచీ అంతరిక్ష రంగం దాకా మనం ఎన్ని విజయాలు సాధించినా పాకిస్తాన్ పాడు బుద్ది నుంచి మాత్రం మనల్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. నేరుగా యుద్ధాలు చేసి ఓడిపోయిన పాక్ తన నక్క జిత్తులతో రోజుకోసారి భారత్ ని కవ్విస్తోంది. తాజాగా మన భారతీయుడైన కుల్భూషణ్ జాదవ్ ను ఉరితీయటానికి పూనుకుని తన రాక్షస ప్రవృత్తి బయటపెట్టింది…
భారత్, పాక్ మధ్య గూఢచర్యం ఆరోపణలు కొత్తవేం కావు. ఇరు దేశాలు అప్పుడప్పుడూ కొందరు వ్యక్తుల్ని గూఢచర్యం చేస్తున్నారంటూ అరెస్ట్ చేస్తుంటాయి. అయితే, ఇప్పటి వరకూ పాక్ ఎంతో మందిని రా ఏజెంట్లంటూ కటకటాల పాలు చేసింది. ప్రాణాలు కూడా తీసింది. కాని, ఎప్పుడూ సరైన సాక్ష్యాధారాలు అంతర్జాతీయ సమాజం ముందు వుంచలేకపోయింది. మరో వైపు ఇండియా ఐఎస్ఐ ఏజెంట్లు ఎవరు దొరికినా చట్ట ప్రకారం విచారణ జరిపి శిక్షలు వేస్తూ వస్తోంది. గూఢచారుల్ని ఉరి తీయటం ఇప్పటి వరకూ ఏనాడూ జరగలేదు. కాని, అత్యంత తాజాగా కుల్భూషణ్ జాదవ్ విషయంలో కూడా పాకిస్తాన్ తన అరాచకత్వాన్ని చాటుకుంది. ఏ విచారణ, ఎలాంటి చట్టబద్ధమైన పద్ధతి పాటించకుండా సైనిక కోర్ట్ ద్వారా ఉరిశిక్ష విధించేసింది. ఒకవేళ నిజంగానే మాజీ నేవీ అధికారి అయిన జాదవ్ … గూఢచారి అయినా .. ఇది సరైంది కాదు. ఉరి తీసేంత ద్రోహం, నేరం జాదవ్ చేసినట్టు ఎక్కడా సాక్ష్యాలు లేవు…
భారత్ పార్లమెంట్లో మన దేశానికి చెందిన కుల్భూషణ్ పై పాక్ రాక్షసత్వంపైన చర్చ జరిగింది. పార్టీలకతీతంగా అందరూ పాకిస్తాన్ ది తప్పేనని అన్నారు. విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర పరిణామాలు వుంటాయని హెచ్చరించారు కూడా. అయితే, ఎన్నో యుద్దాల్లో చావు తప్పి కన్నులొట్టపోయిన పాకిస్తాన్ ఎప్పుడూ మారలేదు. ఇప్పుడు కూడా మారుతుందని ఆశించటం దురాశే. కాబట్టి కుల్భుషణ్ జాదవ్ సంరక్షణకి ఇండియా వీలైనంత ఒత్తిడి తీసుకురావలి. అప్పటికీ ఉగ్రవాద దేశం తన బుద్ధి మార్చుకోకపోతే… పాకిస్తాన్ కారణంగా బలయ్యే చివరి భారతీయుడు జాదవే అయ్యేలా శాశ్వత నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే… రాత్రికి రాత్రి సర్జికల్ స్ట్రైక్స్ చేసిన మన ఆర్మీని పూర్తిస్థాయిలో వేటకి అనుమతిచ్చి వదిలేయాలి. ఇటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటూ అటు బలూచిస్థాన్ కు స్వాతంత్ర్యం కలిగించాలి. మిగిలిన పాక్ ను కూడా ఎన్ని ముక్కలు చేయొచ్చో ఆలిచించాలి. ఎందుకంటే, మన సమస్యలకి పాకిస్తాన్ ఉగ్రవాదులు కారణం కాదు. నేరుగా పాకిస్తానే కారణం. అందుకే, పాక్ అంటూ అసలు ఒక దేశమే లేకుండా చేయటం తప్పేం కాదు!
పాకిస్థాన్ ను సైనికంగా జయించి ముక్కలు చేయటం అనుకున్నంత తేలిక కాదు. చైనా మద్దతు కూడా వుంది కాబట్టి మరింత కఠినం కూడా. అయినా కూడా మోదీ సర్కార్ ఈ దారుణమైన సమస్యకు చరిత్రలో నిలిచిపోయే పరిష్కారం ఖచ్చితంగా వెదకాలి. అందుకు తగిన సమయం ఇదే! ఇప్పటికే ఆలస్యమైపోయిందని దేశంలోని అత్యధిక జనం భావిస్తున్నారు…


.jpg)
.jpg)


