Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అత్యాచార కేసుల్లో సుప్రీం కోర్టు గైడ్ లైన్స్
posted on: Mar 29, 2026 9:59PM
.webp)
లైంగిక దాడులకు గురైన బాధితుల ఆత్మగౌరవాన్ని, గోప్యతను కాపాడాల్సిన విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అత్యాచార బాధితుల వివరాలను వెల్లడించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కొన్ని కచ్చితమైన మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేసింది. అత్యాచార బాధితుల పేర్లను ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో ముద్రించడం, ప్రచురించడం, ప్రసారం చేయడం కూడదని స్పష్టం చేసింది.
ఇది వరకు వెల్లడించిన తీర్పుల్లో బాధితులు, వారి కుటుంబీకుల పేర్లను ప్రస్తావించడం వల్ల వారు మానసిక క్షోభకు గురయ్యారని ధర్మాసనం పేర్కొంది. బాధితుల వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచడం వారి సామాజిక భద్రతకు అత్యంత ముఖ్యమని సుప్రీం కోర్టు పేర్కొంది.
వార్తా సంస్థలు ఈ తరహా కేసులను నివేదించేటప్పుడు బాధితులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వ అధికారులు, ఛార్జ్‌షీట్‌లు లేదా ఇతర అధికారిక పత్రాల్లో బాధితుల గుర్తింపు బయటపడకుండా చూడాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.






