Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సహజీవనం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
posted on: Apr 27, 2026 6:12PM
.webp)
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఒక కీలక కేసులో సుప్రీంకోర్టు ఓ కీలకమైన తీర్పు వెల్లడించింది. సహజీవనం, ప్రేమ సంబంధాలు, పెళ్లి వాగ్దానాలు… ఇవన్నీ కలిసిన ఈ కేసు యువతలో పెద్ద చర్చకు దారితీసింది. మహారాష్ట్రకు చెందిన ఒక న్యాయవాదిపై నమోదైన అత్యాచారం కేసును విచారించిన సుప్రీంకోర్టు, “సహజీవనం ముగిసిందని మాత్రమే అత్యాచారం కేసు పెట్టడం సరైంది కాదు” అని స్పష్టం చేసింది. ప్రేమలో ఏర్పడిన సంబంధం పరస్పర అంగీకారంతో కొనసాగితే... ఆ తర్వాత ఆ బంధం కాస్త విఫలమవడం వల్ల క్రిమినల్ కేసుగా మలచలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
“పెళ్లి చేసుకుంటానని చెప్పి సంబంధం పెట్టుకోవడం” అనే ఆరోపణలు చాలా కేసుల్లో కనిపిస్తున్నాయని కోర్టు గుర్తించింది. అయితే, ప్రతి విఫలమైన ప్రేమ కథను నేరంగా చూడలేమని స్పష్టం చేసింది. ప్రేమలో ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరకపోతే అది నేరం కాదు. తప్పుడు వాగ్దానంమరియు విఫలమైన వాగ్దానం మధ్య తేడా గుర్తించాలి. సంబంధం ప్రారంభం నుంచే మోసం చేయాలనే ఉద్దేశం ఉంటేనే అది నేరంగా పరిగణించవచ్చు... అంతేకానీ పెళ్లి జరగలేదనే కారణంతో కక్షపూరితంగా కేసులు వేయడం సమంజసం కాదని కోర్టు హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలు ప్రేమ సంబంధాలపై చట్టపరమైన స్పష్టత ఇచ్చేలా ఉన్నాయని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో, నిజమైన బాధితులకు న్యాయం అందేలా మరియు తప్పుడు కేసులు తగ్గేలా ఈ తీర్పు మార్గదర్శకంగా నిలుస్తుందని అందరూ అభిప్రాయపడుతున్నారు.


.webp)



