Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్లు నరికివేయడంపై సుప్రీం కోర్టు స్టే
posted on: May 18, 2026 2:27PM

హైదరాబాదులోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో జరుగుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణం మరియు చెట్ల నరికివేత పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. హైదరాబాద్ నగరంలోని అత్యంత ముఖ్యమైన పచ్చదనం కలిగిన ప్రాంతా ల్లో ఒకటైన కేబీఆర్ పార్క్ చుట్టూ ఇప్పుడు మరోసారి పెద్ద చర్చ మొదలైంది. నగరంలో ట్రాఫిక్ సమ స్యలను తగ్గించ డానికి ప్రభుత్వం చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్ట్‌లో భాగంగా అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ నిర్మాణం కారణంగా చెట్ల నరికివేత జరుగుతుందన్న ఆందోళన పర్యావరణ కార్యకర్తలలో మొదలైంది. దీంతో వారంద రూ కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు తాత్కాలికంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాదులో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎస్ఆర్డీపీలో భాగంగా కేబీఆర్ పార్కు చెట్టు ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారం భించింది... అయితే కేబీఆర్ పార్కు చెట్టు ఉన్న పచ్చ దనం హైదరాబాద్ నగరానికి లంగ్స్ ఆఫ్ ది సిటీ ల పనిచేస్తుంది అలాంటి ప్రాంతంలో భారీ నిర్మాణం కారణంగా వందలాది చెట్లు తొలగించే ప్రమాదం ఉందని పర్యావరణ కార్యకర్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో వాద ప్రతి వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం ఎకో సెన్సిటివ్ జోన్ విస్తీర్ణతను తగ్గిస్తుందని, హైకోర్టు సెలవులను అదునుగా తీసుకుని చెట్లు నరికివేస్తుందని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కె. వివేక్ రెడ్డి సుప్రీంకోర్టుకు తెలిపారు.. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం అత్యున్నత న్యాయస్థానం తాత్కాలికంగా కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్కు 35 మీటర్ల పరిధిలోని చెట్లను నరకవద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచార ణను జులై 27 వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు 25 నుండి 30 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్లో చెట్లు నరకడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
దీంతో ఆ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనులు కొన్ని భాగాల్లో తాత్కాలికంగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది.. కె.బీ.ఆర్ పార్క్ అనేది హైదరాబాద్ నగరానికి ఒక ముఖ్యమైన పర్యావరణ కవచంలా పనిచేస్తుంది. అక్కడి పచ్చదనం వాయు కాలు ష్యాన్ని తగ్గించడమే కాకుండా వేలాది మందికి ఉదయం వాకింగ్ జాగింగ్ కోసం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. అలాంటి ప్రాంతం చెట్టు భారీ ఫ్లై ఓవర్ నిర్మాణం జరగడం వల్ల చెట్లు నష్టపోతామని, వాతావరణ కాలుష్యం కూడా పెరిగిపోతుందని పర్యావరణ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.



.webp)


