అయోధ్యవిరాళాల చోరీ కేసులో రాజకీయ జోక్యంపై సుప్రీం అసహనం.!

posted on: Jul 20, 2026 6:30PM

అయోధ్య రామమందిర విరాళాల చోరీ వివాదంపై సీబీఐ దర్యాప్తు లేదా కాగ్ (CAG) ఆడిట్ కోరుతూ దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం (జులై 20) విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు వెలుపల జరుగుతున్న రాజకీయ చర్చలపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.  ఇది కేవలం ఒక నేరపూరిత ఉదంతం. దీనిని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని పేర్కొంది. కోర్టులు రాజకీయాలు చేసే వేదికలు కావంటూ..  పిటిషనర్లకు, రాజకీయ పక్షాలకు ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టం తన పని తాను చేసుకుపోయేలా, నిష్పక్షపాతంగా దర్యాప్తు సాగేలా చూడడమే తమ పరిధి అని వెల్లడించింది.

ఇదలా ఉండగా.. ఈ కేసు దర్యాప్తును కేవలం స్థానిక పోలీసులకే పరిమితం చేయకుండా,  పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి క్లిష్టమైన ఆర్థిక అక్రమాలను ఛేదించడంలో అపారమైన అనుభవం ఉన్న ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) పునర్వ్యవస్థీకరించాలని యూపీ సర్కార్ ను ఆదేశించింది.  దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు ఐజీ   రేంజ్ స్థాయి అధికారిని ఈ సిట్‌లో నియమించాలని సూచించింది.

Ayodhya Ram Mandir, Donation Theft Case, Supreme Court Status Report, Shri Ram Janmabhoomi Trust, SIT Probe

google-ad-img
    Related Sigment News
    • Loading...