తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
posted on: Feb 2, 2026 3:02PM
.webp)
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలుపై తెలంగాణ హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీం న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలు పోస్టులు పెట్టారని పోలీసులు మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ కేసుపై గతంలో విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు, ఆ ఎఫ్ఐఆర్‌లను కొట్టివేస్తూ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టులపై మెకానికల్‌గా కేసులు నమోదు చేయవద్దని పోలీసులకు సూచించింది. ఈ మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్ధించడమే కాకుండా మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పేమీ లేదని పేర్కొంటూ కొట్టివేసింది.


.webp)



