Latest News

లడ్డు కేసు డిస్మిస్ చేసిన సుప్రీం

posted on: Mar 13, 2026 2:11PM

తిరుపతి లడ్డూ తయారీ వినియోగంలో ఉపయోగించిన నెయ్యిలో  జంతువుల కొవ్వు కలిసిందంటూ వస్తున్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్ట్  డిస్మిస్ చేసింది. ఈ పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

  ఇప్పటికే  సీబీఐ  ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నందున, పిటిషనర్ వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నా వాటిని సీబీఐకి అందించాలని సూచించింది.ఈ పిటిషన్‌ను మానూరు శ్రీనివాస్ సుప్రీం కోర్టులో దాఖలు చేశారు.  టిటిడి  తయారు చేసే లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదా హానికర రసాయనాలు ఉన్నాయని తప్పుడు ప్రచారం జరుగుతోందని, అలాంటి ఆరోపణలను నిలిపివేయాలని పిటిషన్‌లో కోరారు.

అలాగే తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవా లని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై కోర్టు జోక్యం అవసరం లేదని భావించిన సుప్రీం కోర్టు పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...