Latest News

టీమ్ ఇండియా పేరుపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీం

posted on: Jan 22, 2026 2:33PM

భారత క్రికెట్ జట్టును టీమ్ ఇండియా అని పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం గురువారం (జనవరి 22) కొట్టివేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత క్రికెట్ జట్టును టీమ్ ఇండియా అని పిలిస్తే మీకేమిటి అభ్యంతరం అంటూ నిలదీసింది. ఇటువంటి అసంబద్ధ పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృధా చేయవద్దంటూ గట్టిగా మందలించింది.  

ఈ పిటిషన్ ను న్యాయవాది రీపక్ కన్సల్ దాఖలు చేశారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఒక ప్రైవేటు సంస్థ అని, దానికి చెందిన జట్టును టీమిండియా అనీ కానీ భారత జాతీయ జట్టు'అని కానీ  పిలవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని  తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పేరు వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదని, కాబట్టి ప్రసార భారతి వంటి సంస్థలు అలా సంబోధించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఈ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం ఇంట్లో కూర్చుని ఇలాంటి పిటిషన్లు వేస్తుంటారని విసక్కుంది.  భారత జట్టు దేశం తరఫున ప్రపంచవ్యాప్తంగా ఆడుతోంది కదా? అంటూ  పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఇటువంటి పిటిషన్ల వల్ల  కోర్టు సమయంతో పాటు మీ సమయం కూడా వృథా అవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. గతంలో ఇదే పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కూడా కొట్టివేసిన సంగతి తెలిసిందే.  

google-ad-img
    Related Sigment News
    • Loading...