ఓరుగల్లు పోలీసుల డాన్స్ అదుర్స్

posted on: Feb 21, 2026 1:33PM

వరంగల్ పోలీసులు డాన్స్ అదరగొట్టేశారు. రాష్ట్ర స్థాయి పోలీసు స్పోర్ట్స్ మీట్ లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ ఆధ్వర్యంలో  బడాఖానాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు చేసిన డ్యాన్స్ అదిరిపోయింది.

సినీమా పాటలకు వరంగల్ పోలీసులు వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి.  విధి నిర్వహణలో  నిత్యం ఒత్తిళ్లను ఎదుర్కొనే పోలీసులకు ఈ సాంస్కృతిక కార్యక్రమం ఓ ఆటవిడుపుగా మారింది. పోలీసు ఉన్నతాధికారులు కూడా అందరితో కలిసిపోయి పాటలకు స్టెప్పులేయడంతో అక్కడంతా ఆహ్లాద, ఆనందకర వాతావరణం ఏర్పడింది. ఉన్నతస్థాయి అధికారులలో దాగున్న డ్యాన్స్ ప్రతిభ ఈ రకంగా వెలుగులోకి వచ్చిందని పలువురు వ్యాఖ్యానించారు.  

https://youtube.com/shorts/IWUS0Gz9Yg8?si=F4ioxuxyetkDHb0w

google-ad-img
    Related Sigment News
    • Loading...