పంజాబ్ ను చిత్తు చేసి పాయిట్ల పట్టికలో అగ్రస్థానానికి హైదరాబాద్

posted on: May 7, 2026 8:24AM

ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు  విజయపరంపర కొనసాగిస్తోంది. బుధవారం ( మే6) ఉప్పల్ వేదికగా పంజాబ్ కిగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సునాయాస విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.  బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.  

 తరువాత 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 202 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ జట్టులో యువ ఆటగాడు కూపర్ కానెల్లీ  కేవలం 59 బంతుల్లోనే 107 పరుగులు చేసి అజేయంగా నిలిచి చేసిన ఒంటరి పోరాటం నిష్ప్రయోజనం అయ్యింది. ఇతర బ్యాటర్లు సన్ రైజర్ బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. 

హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టమైన ప్రదర్శనతో పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేశారు. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. పంజాబ్ ఫీల్డింగ్ లోపాలు కూడా హైదరాబాద్ భారీ స్కోరు సాధించడానికి ఒక కారణంగా మారాయి. సమన్వయ లోపంతో పంజాబ్ ఆటగాళ్లు చేసిన తప్పిదాలను హైదరాబాద్ బ్యాటర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు.

ప్రస్తుత విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన 11 మ్యాచ్‌లలో 7 విజయాలు నమోదు చేసి, మొత్తం 14 పాయింట్లతో టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లింది. అంతకుముందు అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ ఈ ఓటమితో రెండో స్థానానికి పడిపోయింది.   

google-ad-img
    Related Sigment News
    • Loading...