Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వర్మ గురించి నోరు తెరిచిన సన్నీ లియోన్!
posted on: Mar 10, 2017 5:11PM

రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ కామెంట్లపై సన్నీ లియోన్ స్పందించింది. సాధారణంగా ఇప్పటి వరకూ ట్విట్టర్ లో తనకు తోచిందల్లా రాసి సేఫ్ గానే తప్పించుకుంటున్న రామూ ఈసారి బుక్కైనట్టే కనిపిస్తోంది. ఇంతకీ సన్నీ ఏమన్నదంటే, '' మార్పు రావాలంటే మనం ఒకే మాటపై వుండాలి. అందుకే, మనం ఏం మాట్లాడతామో ... అ మాటలు తెలివిగా ఎంచుకోవాలి'' అందామె! ఇందులో సన్నీ లియోన్ ఎక్కడా వర్మ పేరు చెప్పకున్నా ఆమె అతడ్ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు నెటిజన్స్. నిజంగా కూడా... రాము ముందు ముందు తాను ఏం మాట్లాడుతున్నాడో తెలివిగా ఎంచుకుని మాట్లాడితే బెటర్. లేదంటే మరిన్ని కేసులు, హెచ్చరికలు, దాడులు సైతం తప్పకపోవచ్చు!
మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు వర్మ ట్వీట్ల కలకలం రేపాడు. వినాయకుడు మొదలు పవన్ కళ్యాణ్ వరకూ ఎవ్వర్నీ వదిలిపెట్టని ఆర్జీవీ ఆడవాళ్లని కూడా వదిలిపెట్టలేదు. ప్రపంచంలోని ఆడాళ్లందరూ సన్నీ లియోన్ లా మగవాళ్లకు ఆనందాన్ని పంచాలని ఆయన ట్వీట్ చేశాడు. అందులో వున్న అంతరార్థం ఏంటో ఆయనకే తెలియాలి. ఆడ వాళ్లు మగవాళ్లకి సెక్స్ సమకూర్చటం తప్ప మరేం చేయనక్కర్లేదని ఆయన ఉద్దేశమో ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. కాని,గోవాలో తిక్కరేగిన ఒక సామాజిక కార్యకర్త మాత్రం నేరుగా స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. అంతే కాదు, బాలీవుడ్ కార్మిక సంఘం కూడా ఆయన్ని ముంబైలో సినిమాలు చేయనీయమని హెచ్చరించింది! ఇదేదో వ్యవహారం ముదురుతున్నట్టు కనిపించే సరికి ... పైగా హిందూ దేవుళ్ల పై నోరు పారేసుకుని తప్పించుకున్నట్టు ఇప్పుడు సాధ్యం కాదనిపించటంతో వర్మ సారీ చెప్పేశాడు! ఈ మాత్రం సారీ చెప్పే దానికి అసలు ట్వీటడం ఎందుకనే ఉద్దేశంతోనే సన్నీ లియోన్ మాట మీద నిలబడాలి, మాటలు తెలివిగా మాట్లాడాలి అని వర్మకి సెలవిచ్చింది!
రామ్ గోపాల్ వర్మ సన్నీ లియోన్ మాటలు విని ఇక మీదట బుద్దిగా వుంటాడని ఆశించటం దురాశే! ఆయన బై బర్త్ అలా ఓవర్ స్మార్ట్ గా పుట్టారనే విమర్శకులు అంటుంటారు. అందుకే, హిందూ పండగలు మొదలు పవన్ కళ్యాణ్, చిరంజీవి ఉద్యమాలు, సినిమాల వరకూ అన్నీ ఆయనకే కావాలి. పైగా ప్రతీ దాంట్లోనూ జనాల్లో హిపోక్రసీ వుందంటూ వాపోతాడు పాపం. అది నిజమే అయినా రాము రిపీటెడ్ కాంట్రవర్సియల్ ట్వీట్స్ జనం సహనాన్ని పరీక్షిస్తున్నాయన్నది కూడా నిజం! తన స్వంత అబిప్రాయం కొంచెం హుందాగా చెప్పకుండా పది మందిని రెచ్చగొట్టేలా చెబుతూ పబ్లిసిటీ దండుకోవటం తప్ప ఆయన సాధిస్తున్నదేం లేదు!
కాలం బాగున్నప్పుడు ఎన్ని ట్వీట్స్ చేసినా ఓకే. కాలం కలిసి రానప్పుడే అడ్డంగా బుక్కయ్యేది. బాలీవుడ్ సినీ కార్మికులు ఎదురు తిరిగితే అది వర్మ కెరీర్ కే పెద్ద నష్టం. ఉబుసుపోని ట్వీట్స్ కోసం బంగారం లాంటి బాలీవుడ్ కెరీర్ ని నాశనం చేసుకోవద్దని కోరుకుంటున్నారు ఆయన సిన్సియర్ అభిమానులు.



.jpg)


